జమ్ముకశ్మీర్‌లో(jammu kashmir news) ఇటీవల పౌరులపై జరిగిన దాడులు అనంతరం భద్రతా దళాలు చేపట్టిన ఉగ్ర వేటలో(jammu kashmir encounter news) 11 మంది ముష్కరులు హతమయ్యారు. మొత్తం 8ఎన్కౌంటర్లలో వీరిని మట్టుబెట్టారు పోలీసులు. సామన్యులపై ఉద్రదాడుల(militancy in kashmir) అనంతరం తమపై బాధ్యత మరింత పెరిగిందని, అందుకే వరుస ఆపరేషన్లు చేపట్టి తీవ్రవాదులను ఏరివేస్తున్నట్లు జమ్ముకశ్మీర్(jammu kashmir news today) ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. పౌరులపై దాడుల అనంతరం అనేక మంది ముష్కరులు దక్షిణ కశ్మీర్‌కు పారిపోయారని వెల్లడించారు. వారిలో ఒకరు షోపియాన్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమైనట్లు చెప్పారు.
శుక్రవారం బెమినాలో జరిగిన ఎన్కౌంటర్లోనూ ఓ ముష్కురుడిని మట్టుబెట్టినట్లు విజయ్ తెలిపారు. అతడిని లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌తో సంబంధాలున్న తంజీల్గా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌తో పాటు పుల్వామాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ముగ్గరు ముష్కరులు తప్పించుకున్నారని వారి కోసం సెర్చించ్ ఆపరేషన్ కొనసాగుతోందని విజయ్ పేర్కొన్నారు.