లోయలో పడ్డ వాహనం- 13 మంది దుర్మరణం - vikasnagar dehradun
चकराता से विकासनगर की ओर आ रहा एक यात्री वाहन वाइला बेकाबू होकर गहरी खाई में जा गिरा, इस हादसे में 11 लोगों की मौत हो चुकी है.
![లోయలో పడ్డ వాహనం- 13 మంది దుర్మరణం 11 people died in a road accident at vikasnagar dehradun](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13508723-thumbnail-3x2-road-accident.jpg)
10:36 October 31
లోయలో పడ్డ వాహనం- 13 మంది దుర్మరణం
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. చక్రతా నుంచి వికాస్ నగర్వైపు వెళ్తున్న ఓ ప్రయాణికుల వాహనం లోయలో పడగా.. 13 మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
వాహనంలో మొత్తం 15 మంది ఉన్నట్లు సమాచారం. త్యూనీ రోడ్డు వద్ద ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు.
ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ.. బాధితులకు మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.