ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంతో జమ్ము కశ్మీర్లో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులపై అక్కడి యంత్రాంగం కొరడా ఝులిపించింది. వీరందరినీ విధుల నుంచి తొలగించింది.
వేటు పడినవారిలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారులు ఇద్దరు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 11 మందిలో ఇందులో ఇద్దరు టీచర్లు ఉన్నట్లు తెలిపారు. వీరు దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. మరోవైపు, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు.. ఉగ్రవాదులకు రహస్యంగా సమాచారం చేరవేస్తున్నారని వివరించారు. ఎలాంటి విచారణ అవసరం లేకుండా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం వీరిని తొలగించినట్లు చెప్పారు.