తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కార్మికురాలిపై 11 మంది గ్యాంగ్​రేప్​.. భర్తను పక్క గదిలో బంధించి మరీ! - మహారాష్ట్ర క్రైమ్ న్యూస్

గిరిజన కార్మికురాలిపై 11 మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్తను గదిలో బంధించి మరీ దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ అమానుష ఘటన మహారాష్ట్ర సతారా జిల్లాలో జరిగింది. ఇద్దరు దళిత బాలికలను కిడ్నాప్ చేసి వారం రోజుల పాటు వారిపై అత్యాచారం చేసిన ఘటన ఝూర్ఖండ్​లో వెలుగుచూసింది.

Maharashtra Crime News
గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం

By

Published : Jul 8, 2023, 2:48 PM IST

బొగ్గు ఫ్యాక్టరీలో పనిచేసే గిరిజన మహిళపై 11 మంది కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి భర్తను గదిలో బంధించి.. నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ అమానుష ఘటన మహారాష్ట్ర సతారా జిల్లాలో జరిగింది. అనంతరం మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఫ్యాక్టరీ యజమానిని, కేసులో ప్రధాన నిందితుడు బాలు షేక్​లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ఇదీ కథ..
రాయ్​గఢ్​కు చెందిన ఓ గిరిజన మహిళ సోనావాడి​లోని బొగ్గు ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ఆ ఫ్యాక్టరీ సమీపంలోని పాల ప్రాంతంలో నివాసం ఉంటోంది. 11 మంది దుండగులు గిరిజన మహిళ భర్తను గదిలో బంధించి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎలాగోలా దుండగుల బారి నుంచి తప్పించుకున్న దంపతులు ఐదేళ్ల కుమార్తెతో పాటు పండరీపుర్ వెళ్లి అక్కడ నుంచి వారి స్వగ్రామం రాయ్​గఢ్​కు చేరుకున్నారు.

జరిగిన విషయం గురించి మహిళ తన మావయ్యకు వివరించింది. అనంతరం బాధిత మహిళ.. కార్మిక మహిళా యూనియన్​ను ఆశ్రయించడం వల్ల ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా ఓ వైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటనలో ఉండగా.. గిరిజన మహిళపై అత్యాచారం జరగడం కలకలం రేపింది.

బాధిత మహిళతో తన మావయ్య.. రాయ్​గఢ్​ జిల్లాలోని మాంఢ్వీ పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించి నిందితులపై ఫిర్యాదు చేశాడు. మాంఢ్వీ పోలీసులు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. సతారా స్టేషన్​కు సమాచారం చేరవేశారు. అనంతరం సతారా పోలీసులు బాధిత మహిళను ఘటనా స్థలానికి తీసుకెళ్లి ఆమె స్టేట్​మెంట్​ రికార్డు చేశారు. మహిళ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు ఫ్యాక్టరీ యజమాని, ప్రధాన నిందితుడు బాలు షేక్​ను అదుపులోకి తీసుకొని మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మైనర్లపై వారం రోజులపాటు అత్యాచారం..
ఝార్ఖండ్​లో నలుగురు కామాంధులు, ఇద్దరు దళిత బాలికను కిడ్నాప్​ చేసి.. వారం రోజులుగా పలుమార్లు వారిపై అత్యాచారం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన దుండగులను పోలీసులు అరెస్ట్​ చేసి విచారణ ప్రారంభించారు.

ఇదీ జరిగింది..
లతేహర్ జిల్లా భార్వాడ్ పోలీస్ స్టేషన్​ పరిధిలో.. దళిత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. ఈ మేరకు మైనర్ల కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రతను తెలుసుకున్న భార్వాడ్ ఎస్​పీ అంజనీ అంజన్​ సిట్​ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అయితే బాలికలను గార్వాకు చెందిన వ్యక్తులు కిడ్నాప్​ చేసినట్టు పోలీసులకు ఈ విచారణలో సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందాలతో పోలీసులు గార్వాకు చేరుకొని ఘటనా స్థలిపై దాడి చేశారు. నిందితుల నుంచి బాలికలను క్షేమంగా విడిపించి.. నలుగురిని అరెస్ట్ చేశారు.

వారం రోజుల పాటు రేప్..నిందితులు తమను కిడ్నాప్ చేసి.. ఓ ఇంట్లో బంధించారని బాలికలు తెలిపారు. వారిని అపహరించిన కిడ్నాపర్లు.. వారం రోజుల పాటు వారిపై అత్యాచారం చేశారని మైనర్లు వాపోయారు.

నిందితుల అరెస్ట్​...అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితులను అజయ్, హృతిక్, ఆశిష్ కుమార్, కునల్ కుమార్​లుగా పోలీసులు గుర్తించారు. వారందరూ గార్వా ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నారు. ఈ ఘటనలో అజయ్​ను ప్రధాన సూత్రధారుడిగా భావిస్తూ.. పోలీసులు అతడిపై ఉన్న పాత రికార్డులు తిరగేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details