Grand Mother running race: అథ్లెటిక్స్‌లో రికార్డు సృష్టించింది ఓ బామ్మ. వయసు 100 ఏళ్లు దాటినా.. తగ్గేదే లేదని నిరూపించింది. నడవడమే కాదు, కూర్చొని కాళ్లు చేతులు ఆడించడమే కష్టం అనుకునే వయసులో ఈ బామ్మ.. వంద మీటర్ల పందెంలో దౌడు తీసి అదరగొట్టింది. గుజరాత్లో నిర్వహించిన ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రమాబాయి అనే 106ఏళ్ల బామ్మ ఏకంగా స్వర్ణ పతకం గెలుచుకుంది. గుజరాత్ రాష్ట్ర క్రీడలు, హోంమంత్రి హర్ష్ సంఘ్వి బామ్మకు సాదర స్వాగతం పలికారు. ఎంతో ఉత్సాహంతో తోటి పోటీదారులను పలకరిస్తూ కనిపించింది బామ్మ. ఈ 100 మీటర్ల పోటీల్లో హరియాణాకే చెందిన 82 ఏళ్ల జగ్దీశ్ శర్మ రెండో స్థానంలో నిలిచారు.
106ఏళ్ల వయసులో 100 మీటర్ల రేస్.. బామ్మ పరుగుకు 'స్వర్ణం' - రమాబాయి రన్నింగ్ రేస్
100m race 106 old woman: వందేళ్ల వయసులో ఓ బామ్మ రన్నింగ్ రేసులో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. పాల్గొనడమే కాకుండా పోటీల్లో స్వర్ణం ఎగరేసుకుపోయింది. బామ్మ మనవరాలు సైతం ఈ పోటీల్లో పాల్గొంది.
హరియాణాలోని చార్కి దాద్రికి చెందిన రమాబాయి.. గత 12 నెలలుగా ఈ పోటీల కోసం ప్రాక్టీస్ చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంది. వీరి కుటుంబ సభ్యులు సైతం క్రీడలను అమితంగా ఆదరిస్తున్నారు. గుజరాత్లో నిర్వహించిన పోటీల్లో రమాబాయి మనవరాలు షర్మిలా సంగ్వాన్ సైతం పాల్గొంది. 35ఏళ్లు పైబడిన విభాగంలో షర్మిల పోటీ పడింది. 3వేల మీటర్ల రన్నింగ్ రేసులో మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. తన బామ్మతో కలిసి పోటీల్లో పాల్గొనడం చాలా ఉత్సాహంగా ఉందని షర్మిల చెబుతోంది.
ఇదీ చదవండి: