10 వేల 2-డీజీ కరోనా యాంటీవైరల్ ఔషధాలు.. దేశంలో గురువారం మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ-హెల్త్ సేవలు, టెలీకన్సల్టేషన్ పోర్టల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో సైన్యాధిపతి ఎంఎం నరవణె, నావికా దళ అధిపతి అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ పాల్గొన్నారు.
"2-డీజీ కరోనా యాంటీవైరల్ ఔషధం మంచి ఫలితాలను ఇస్తోంది. డ్రగ్ సరఫరా చేయాలని చాలా రాష్ట్రాలు కోరుతున్నాయి. గురువారం 10 వేల ప్యాకెట్లు విపణిలోకి రానున్నాయి."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి