తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మార్చి నెలాఖరుకల్లా 500 రైతు ఉత్పత్తి సంఘాలు - వ్యవసాయ చట్టాలు

దేశ వ్యాప్తంగా 500 రైతు ఉత్పత్తి సంఘాలను (ఎఫ్‌పీవోలు) ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ సంఘంలో సభ్యుడైన ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం రూ.2వేల చొప్పున అందజేస్తుంది. 2024 ప్రథమార్థం ముగిసేనాటికి దేశవ్యాప్తంగా 10వేల ఎఫ్​పీవోలను దశల వారీగా ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

10,000 farmer produce organisations to be established all over india by 2024
మార్చి నెలాఖరుకల్లా 500 రైతు ఉత్పత్తి సంఘాలు

By

Published : Feb 12, 2021, 7:06 AM IST

మూడు నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను రుజువు చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా కనీసం 500 రైతు ఉత్పత్తి సంఘాలను (ఎఫ్‌పీవోలు) మార్చి నెలాఖరుకల్లా ఏర్పాటుచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 2024 ప్రథమార్థం ముగిసేనాటికి దేశవ్యాప్తంగా 10,000 ఎఫ్‌పీవోలను దశలవారీగా ఏర్పాటుచేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది.

ఈ పథకంలో భాగంగా ప్రతి సంఘానికి మూడేళ్లలో రూ.18 లక్షలు ఇస్తారు. సంఘంలో సభ్యుడైన ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,000 చొప్పున అందజేస్తుంది. ఒక ఎఫ్‌పీవోకు గరిష్ఠంగా రూ.15 లక్షలు కేటాయిస్తారు.

ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందడం కోసం ప్రతి ఎఫ్‌పీవోకు రూ.2 కోట్ల వరకు రుణ హామీ సదుపాయాన్ని కల్పిస్తారు.

ఇదీ చదవండి :నేడే తొలి సీఎన్​జీ ట్రాక్టర్​​ ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details