100 Times Blood Donor :రక్త సైనికుల గ్రామంగా తమిళనాడు.. హవేరి జిల్లాలోని అక్కిఆలూరూ గ్రామం పేరుగాంచింది. తాజాగా ఆ గ్రామానికి చెందిన కరబనప్ప మనోహర్ గొంది అనే వ్యక్తి ఇప్పుడు మరో రికార్డు సృష్టించాడు. జిల్లాలో 100 సార్లు రక్తదానం చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. తరచూ రక్తదానం చేస్తూ.. ఎంతో మంది ప్రాణాలను కాపాడి అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు.
అక్కిఆలూరు గ్రామంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో వందో రక్తదానం, రక్త సంబంధ వ్యాధుల సమయోధుల ఉచిత సంరక్షణ గృహం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. అందులో బ్లడ్ డిజార్డర్ ఫైటర్స్ (తలసేమియా, హిమోఫిలియా) ఉచిత కేర్ హోమ్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో బ్లడ్ డిజార్డర్ ఫైటర్స్ కోసం నిర్మించిన తొలి కేర్ హోమ్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో కరబసప్ప గొంది వందో సారి రక్తదానం చేశారు. ఆయనతో పాటు మరో 30 మందికి పైగా దాతలు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా కరబనప్ప గొంది మీడియాతో మాట్లాడారు. "రక్తదానంపై మొదట్లో చాలా మూఢనమ్మకాలు ఉండేవి. అందుకే స్నేహ మైత్రి బ్లడ్ ఆర్మీ గ్రూప్‌ను ఏర్పాటు చేసి రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాం. ప్రారంభంలో ప్రజలు రక్తదానంపై విముఖత చూపేవారు. కానీ క్రమంగా రక్తదానం చేయడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు స్నేహ మైత్రి బ్లడ్ ఆర్మీ ఆధ్వర్యంలో దాదాపు 125 రక్తదాన శిబిరాలు నిర్విహించాం. అందులో దాదాపు వంద శిబిరాలు హవేరి జిల్లాలో ఏర్పాటు చేశాం. రక్త సైనికులకు నిలయమైన అక్కి ఆలూరులోనే సుమారు 25 రక్తదాన శిబిరాలు నిర్వహించాం. హావేరి జిల్లాలో 200 మందికి పైగా చిన్నారులు తలసేమియా, హీమోఫీలియాతో పాటు వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు" అని చెప్పారు.