ఉత్తర్ప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన భాజపా(up bjp news).. మరోసారి అధికారంలోకి రావాలని కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్రంలోని ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు ఓ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు(up assembly election 2022) సరిగ్గా 100 రోజుల ముందు నుంచి రోజుకొకటి చొప్పున 100 కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల(uttar pradesh election 2022) అజెండా సిద్ధం చేసిన యూపీ భాజపా నాయకులు.. దీని ఆమోదం కోసం దిల్లీలో పార్టీ అధిష్ఠానంతో సమావేశమయ్యేందుకు వెళ్లారు.
ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా యూపీలో భాజపా ప్రభుత్వం(uttar pradesh bjp) చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయనున్నారు భాజపా కార్యకర్తలు. ప్రతి మండలం, అసెంబ్లీ నియోజకవర్గంలో రోజుకో కార్యక్రమం నిర్వహించనున్నారు. భాజపాలో వివిధ సంఘాలకు ఒక్కో దానికి కొన్ని రోజులు కేటాయించి బూత్ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
ఆదివారం జరిగిన సమావేశంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ అజెండాను ఖరారు చేశారు. దిల్లీలో పార్టీ అధిష్ఠానంతో జరిగే భేటీలో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలతో పాటు హిందూ వర్గం ఓట్లు చీల్చేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రణాళికలను పార్టీ నాయకులు సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆ స్థానాల్లో ముస్లిం ఓటర్లే అధికం..