దేశంలో కరోనా టీకా పంపిణీ 100 కోట్ల డోసుల మార్క్(100 crore vaccine) దాటిన సందర్భంగా.. దేశంలోని వంద చారిత్రక కట్టడాలపై జాతీయ జెండా మెరుపుల్ని వెలిగించినట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గురువారం పేర్కొన్నారు.
త్రివర్ణ కాంతుల్లో మెరిసిన చారిత్రక కట్టడాలు - జెండా రంగుల్లో చారిత్రక కట్టడాలు
దేశంలో టీకా పంపిణీ 100 కోట్ల డోసుల(100 crore vaccine) మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విభిన్నంగా అభినందనలు తెలిపింది. దేశంలోని వివిధ చారిత్రక కట్టడాలను మువ్వన్నెల కాంతులతో ముస్తాబు చేసి, కొవిడ్‌తో పోరాడుతున్న ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి కృతజ్ణతలు తెలిపింది.
త్రివర్ణ కాంతుల్లో చారిత్రక కట్టడాలు
యునెస్కో గుర్తింపు పొందిన ఎర్రకోట, కుతుబ్ మినార్, హుమాయున్ టూంబ్, తుగ్లకాబాద్ కోట, పురానా ఖిలా, ఆగ్రా, రామప్ప గుడి, హంపి, ధోలవీర, చారిత్రక ప్రాంతాలతో పాటు దేశంలోని మరిన్ని చారిత్రక కట్టడాలపై త్రివర్ణ వెలుగులు విరజిమ్మాయి. కొవిడ్‌తో పోరాడుతున్న ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి త్రివర్ణ వెలుగులతో కృతజ్ణతలు(India Vaccination status) తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి:
Last Updated : Oct 21, 2021, 11:08 PM IST