Top 10 Historical Places in Hyderabad :రోజువారీ జీవితంలో, తీరిక లేని పనులతో అలసిపోయి విరామం కోసం ఎదురుచూస్తున్నారా? వీకెండ్, సెలవు రోజుల్లో అయినా ప్రశాంతంగా, ఉత్సాహభరితంగా గడపాలని కోరుకుంటున్నారా? అయితే మీ కోసం భాగ్యనగంలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాలు(Tourist Places)ఎదురుచూస్తున్నాయి. ఇంతకీ నగరంలోని ఆ బెస్ట్ చారిత్రక పర్యాటక ప్రదేశాలేంటి? ఎంట్రీ ఫీజు ఎంత? టైమింగ్స్? లోకేషన్ ? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Golconda Fort(గోల్కొండ కోట) :ఈ గోల్కొండ కోటను కాకతీయ రాజులు నిర్మించారు. ఆ తర్వాత కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన సుల్తాన్ కులీ కుతుబ్-ఉల్-ముల్క్ దీన్ని పునరుద్ధరించి.. తన పాలనకు కేంద్రంగా ఎంచుకున్నాడు. 400 అడుగుల ఎత్తైన గ్రానైట్ కొండపై నిర్మించిన ఈ కోట(Golconda Fort)ను దేశంలోని పురావస్తు అద్భుతాల్లో ఒకటిగా పేర్కొన్నారు.
- లొకేషన్ :ఖైర్ కాంప్లెక్స్, ఇబ్రహీం బాగ్, హైదరాబాద్
- ఓపెనింగ్ టైమ్ :ప్రతి రోజు ఉదయం 08:00 నుంచి సాయంత్రం 05:30 వరకు
- ప్రవేశ రుసుము :భారతీయ పౌరులు - ఒక్కొక్కరికి ₹15, విదేశీ పౌరులు – ఒక్కొక్కరికి ₹200.
Charminar(చార్మినార్) :భాగ్యనగరంలో అతి ముఖ్యమైనది 'చార్మినార్'. ఇది నాలుగు మినార్లు కలిగిన కట్టడం అని అందరికీ తెలుసు. కానీ చాలా మందికి ఈ నిర్మాణంలో అడుగడుగునా చార్ దాగి ఉందనే విషయం తెలియదు. ప్రతి కోణంలోనూ ఈ కట్టడాన్ని నాలుగు ప్రతిబింబించేలా నిర్మించడంతో ఇది ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతిని పొందింది. ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే రాజు దీనిని నిర్మించాడు. 1889లో హైదరాబాద్‌ను పాలించిన నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ లండన్ నుంచి నాలుగు పెద్ద గడియారాలను తెప్పించి దీనికి నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కట్టడం నగరంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలలో ఒకటి.
- లొకేషన్ :చార్ కమాన్, ఘాన్సీ బజార్, హైదరాబాద్
- టైమింగ్స్ :ప్రతి రోజు ఉదయం 09:30 నుంచి సాయంత్రం 05:30 వరకు
- ఎంట్రీ ఫీజు : భారతీయ పౌరులు - ఒక వ్యక్తికి ₹5, విదేశీ పౌరులు - ఒక్కొక్కరికి ₹100.
Qutub Shahi Tombs(కుతుబ్ షాహీ టూంబ్స్) : నగరంలోని పురాతన స్మారక కట్టడాలలో ఒకటైన కుతుబ్ షాహీ సమాధులను సుల్తాన్ కులీ నిర్మించారు. ఈ టూంబ్స్.. గోల్కొండ కోటలోని బంజారా దర్వాజా నుంచి సుమారు 850 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ సమాధుల నిర్మాణం పర్షియన్, పఠాన్, దక్కన్, హిందూ శైలిలో ఉంది.
- స్థానం : ఫోర్ట్ రోడ్, టోలి చౌకీ, హైదరాబాద్
- ఓపెనింగ్ సమయం : శుక్రవారం తప్ప ప్రతి రోజు ఉదయం 09:30 నుంచి సాయంత్రం 04:30 వరకు.
- ఎంట్రీ ఫీజు :పిల్లలకు - ఒక్కొక్కరికి ₹5, పెద్దలు – ఒక్కొక్కరికి ₹10.
Makkah Masjid(మక్కా మసీదు) :17వ శతాబ్దంలో 10వేల మందికి ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యంతో నిర్మించిన మక్కా మసీదు భారతదేశంలో అతిపెద్దది. ఈ కట్టడానికి మక్కాలోని గ్రాండ్ మసీదు నుంచి ఈ పేరు వచ్చింది. అలాగే నిర్మాణంలోని సెంట్రల్ ఆర్చ్‌వేలో ఉపయోగించిన ఇటుకలు.. మక్కా నుంచి సేకరించిన మట్టి నుంచి తయారు చేశారు.
- లొకేషన్ : లాడ్ బజార్ రోడ్, ఖిల్వత్, హైదరాబాద్
- ఓపెనింగ్ సమయం : ప్రతి రోజు 04:00 am నుంచి 09:30 pm వరకు;
- ప్రవేశ రుసుము : ఉచితం
Chowmahalla Palace(చౌమహల్లా ప్యాలెస్) : 18వ శతాబ్దంలో నిర్మించిన చౌమహల్లా ప్యాలెస్ అసఫ్ జాహీ రాజవంశం పాలనా కేంద్రంగా ఉంది. ఆ తరువాత హైదరాబాద్ నిజాంలకు నివాసంగా మారింది. ఈ విశాలమైన నిర్మాణంలో రెండు ప్రాంగణాలు, ఫౌంటైన్‌లతో పాటు ఖిల్వత్ అనే దర్బార్ హాలు, 12 ఎకరాల విస్తీర్ణం కలిగిన తోటలు ఉన్నాయి.
- లొకేషన్ :ఖిల్వత్, మోతిగల్లి, హైదరాబాద్
- ఓపెనింగ్ టైమ్ :శుక్రవారాలు తప్ప ప్రతి రోజు ఉదయం 10:00 నుంచి సాయంత్రం 05:00 వరకు;
- ప్రవేశ రుసుము :భారతీయ పౌరులు - ఒక్కొక్కరికి ₹80, విదేశీ పౌరులు - ఒక్కొక్కరికి ₹200.
Salar Jung Museum(సాలార్ జంగ్ మ్యూజియం) : సాలార్ జంగ్ మ్యూజియం.. ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియంలలో ఒకటిగా.. అలాగే దేశంలోని మూడు జాతీయ మ్యూజియంలలో ఒకటిగా పేరు పొందింది. జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, నేపాల్, చైనా, బర్మా, పర్షియా, ఈజిప్ట్, యూరప్, ఉత్తర అమెరికా నుంచి సేకరించిన వస్తువులు ఇందులో ఉన్నాయి. మొత్తం 38 గ్యాలరీలు ఉన్నాయి. ఔరంగజేబు ఖడ్గం, గియోవన్నీ బెంజోనీ రచించిన వెయిల్డ్ రెబెక్కా, బంగారం, వెండితో వ్రాసిన ఖురాన్, టిప్పు సుల్తాన్ వార్డ్రోబ్తో పాటు మరెన్నో ముఖ్యమైన వస్తువులు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి.
- లొకేషన్ :సాలార్ జంగ్ రోడ్, నయా పుల్, హైదరాబాద్
- సందర్శన సమయాలు :శుక్రవారం తప్ప ప్రతి రోజు ఉదయం 10:00 నుంచి సాయంత్రం 05:00 వరకు;
- ప్రవేశ రుసుము :భారతీయ పౌరులు - ఒక్కొక్కరికి ₹10, విదేశీ పౌరులు - ఒక్కొక్కరికి ₹150.