ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింఘబమ్ జిల్లా చాయిబాసాలో జరిగిన ఐఈడీ పేలుడుకు సంబంధించి పోలీసులు శనివారం 10 మంది నక్సల్స్‌ను అరెస్టు చేశారు. పేలుడుకు ముందు భద్రతా దళాల కదలికలపై రెక్కీ నిర్వహించినట్లు నక్సల్స్ వెల్లడించారని పోలీసులు తెలిపారు.
ఝార్ఖండ్‌లో పది మంది నక్సల్స్ అరెస్ట్ - ఐఈడీ పేలుడు ఝార్ఖండ్
ఝార్ఖండ్‌లోని చాయిబాసాలో జరిగిన పేలుడుకు సంబంధించి పోలీసులు 10 మంది నక్సల్స్‌ను అరెస్టు చేశారు. ఈనెల 4న జరిగిన ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
ఝార్ఖండ్‌లో పది మంది నక్సల్స్ అరెస్ట్
ఈనెల 4న చాయిబాసాలోని టోక్లో ప్రాంతంలో నక్సల్స్ ఐఈడీ పేలుడు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లాంజీ అటవీ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి :'ముస్లిం యువతి- హిందూ యువకుడి పెళ్లి చెల్లదు'