ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో జికా వైరస్(Zika virus in Kanpur) విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా మరో 10 మంది.. వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం జికా వైరస్(Zika virus in India) బాధితుల సంఖ్య 89కి చేరింది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి అధికమవుతుండడం వల్ల జికా కట్టడికి యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇంటింటికీ వెళ్లి పరీక్షలు..
వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి కాన్పుర్ జిల్లా యంత్రాంగం కృషిచేస్తోందని అధికారులు తెలిపారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జికా(Zika Virus In Kanpur) లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం 150 బృందాలతో శానిటైజేషన్, ఫాగింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జికా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్థానికులెవరూ భయాందోళనకు గురి కావద్దని డీఎం విశాఖ సూచించారు. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వాయుసేన సిబ్బందికి జికా(Zika Virus In Kanpur) సోకిన నేపథ్యంలో.. ఐఏఎఫ్ స్థావరం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు మరో అధికారి తెలిపారు.