మధ్యప్రదేశ్ బాలాఘాట్‌లో నక్సలైట్ల పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 11మందిని అరెస్ట్ చేయగా.. వీరి వద్ద నుంచి సుమారు రూ.10కోట్లను స్వాధీనం చేసుకున్నారు. నంబర్టోలా గ్రామానికి చెందిన నిషాబాయి అనే మహిళకు డబ్బుల ఆశ చూపి.. ఆమె ఇంట్లో ఈ నగదును పాతిపెట్టారు. అంతకుముందు అరెస్టైన అజయ్, మహేశ్‌ను విచారించగా.. ఇంటి కింద భూమిలో నగదు పాతిపెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. వారికి ఆశ్రయం ఇచ్చినందుకు గాను మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు నక్సలైట్లతో సంబంధం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు.
ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య:మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలో దారుణం జరిగింది. ముగ్గురు గిరిజన అక్కాచెల్లెళ్లు ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జవర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటాఘాట్ గ్రామానికి చెందిన జామ్సింగ్కు ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. ఆయన కొన్నేళ్ల కింద మరణించగా.. తల్లితో కలిసి జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబంలో సమస్యలు అధికమవడం వల్ల ముగ్గురు అక్కాచెల్లెలు ఉరివేసుకుని చనిపోయారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులను సోను (23), సావిత్రి (21), లలిత (19)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని.. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.
ఎనిమిదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం.. వీడియో తీసిన యువకులు: తమిళనాడు తిరువళ్లూరులో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 75 ఏళ్ల వృద్ధుడు. దీనిని మరో యువకుడు వీడియో తీసి షేర్ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీడియోను షేర్ చేసిన ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు.
మరోవైపు ఆ బాలిక పాముకాటుతో జులై 24న మరణించింది. అయితే ఇప్పుడు ఆమె మరణంపై సైతం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలిక తండ్రి మరణించగా.. తల్లి వేరుగా ఉంటుంది. దీంతో బాలిక బంధువుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో యువకుడు చాటుగా చిత్రీకరించాడు. ఈ వీడియో చూపించి వృద్ధుడు వద్ద నుంచి డబ్బులు సైతం వసూలు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. ఆగస్టు 5 వరకు కస్టడీ విధించింది.
హనీ ట్రాప్‌లో ఆర్మీ జవాన్.. పాకిస్థాన్‌కు కీలక సమాచారం: పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న ఆర్మీ జవాన్‌ను రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు మహిళా ఏజెంట్ల వలలో పడిన ఓ ఆర్మీ జవాన్.. డబ్బుకు ఆశపడి సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో వారికి చేరవేశాడు.