కర్ణాటకలో కరోనా కలవరం కొనసాగుతోంది. బెంగళూరు బెల్లందుర్లోని ఎస్జేఆర్ వాటర్ మార్క్ అపార్ట్మెంట్లో 10 కరోనా కేసులు వెలుగు చూశాయి.
అపార్ట్మెంట్లో 10 మందికి కరోనా- 500 మందికి టెస్టులు - covid in apartment
కర్ణాటక బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో 10 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆ భవనంలోని మరో 500 మంది నమూనాలను ఆర్టీపీసీఆర్ పరీక్షకు పంపారు. ఆ ఫలితాలు మంగళవారం రానున్నాయి.
అపార్ట్మెంట్లో కరోనా- భయాందోళలో 1500 మంది!
500 మందికి టెస్టులు
9 బ్లాకులు ఉన్న ఈ అపార్ట్మెంట్లో 1500 మంది నివసిస్తున్నారు. 6 బ్లాకుల్లోని వారిలో కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆ ఆరు బ్లాకులను కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. 500 మంది నమూనాలను సేకరించి అధికారులు ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం పంపారు. వారి రిపోర్టులు మంగళవారం రానున్నాయి.