1 Lakh Salary Per Month Govt Jobs In India: భారతదేశంలో చాలా మంది యువతీ, యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు.. సమాజంలో మంచి గుర్తింపుతోపాటు, ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది. కానీ, వాస్తవం ఏమిటంటే.. ప్రైవేట్ ఉద్యోగులతో పోల్చితే, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ప్రభుత్వ రంగంలో కూడా భారీగా జీతాలు ఇచ్చే ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. సీనియర్ ఆఫీసర్లకు మాత్రమే కాదు.. ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు కూడా రూ.1 లక్షకు పైగా జీతం వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ జీతం
RBI Grade B officer salary :రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో గ్రేడ్ బి ఆఫీసర్ ప్రారంభ వేతనం నెలకు సుమారుగా రూ.1,16,000 వరకు ఉంటుంది. పైగా వసతి సౌకర్యం కల్పిస్తారు. ఒక వేళ వసతి కల్పించకపోతే.. హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) ఇస్తారు. ఇది బేసిక్ సాలరీలో 15 శాతం వరకు ఉంటుంది. అంతేకాదు సీనియారిటీ పెరుగుతున్న కొలదీ ఈ ఉద్యోగుల జీతాలు మరింత పెరుగుతాయి.
సెబీ గ్రేడ్ ఏ ఆఫీసర్ వేతనం
SEBI Grade A officer salary :సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)లో గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్‌కు సుమారుగా రూ.1,06,000 వరకు వేతనం ఇస్తారు. ఇది ఎంట్రీ లెవెల్ పొజిషన్. సీనియర్లకు మరింత భారీగా జీతాలు ఉంటాయి.