తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాక్సినేషన్ 2.0: తొలి రోజు 1.28 లక్షల మందికి టీకా - రెండో దశ కరోనా టీకా పంపిణీ

రెండో దశ వ్యాక్సినేషన్​లో భాగంగా.. సోమవారం ఒక్కరోజే 60 ఏళ్లకు పైబడిన 1.28 లక్షల మందికి కొవిడ్​ టీకా పంపిణీ చేశారు. 45-59 ఏళ్ల వయస్సుండి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న 18 వేల మందికిపైగా టీకా తీసుకున్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 1.47 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు.

vaccination second phase in india
సోమవారం 1.28 లక్షల మంది వృద్ధులకు టీకా

By

Published : Mar 2, 2021, 5:12 AM IST

Updated : Mar 2, 2021, 8:00 AM IST

దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్​ కార్యక్రమం సోమవారం జోరుగా కొనసాగింది. ఒక్కరోజే 60 ఏళ్లు పైబడిన 1,28,630 మంది కొవిడ్​ టీకా తీసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులు 18,850 మందికి టీకా అందింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

లెక్కల్లో వ్యాక్సినేషన్ ఇలా..


  • దేశంలో ఇప్పటివరకు 1,47,28,569 వ్యాక్సిన్​ డోసులను పంపిణీ చేశారు.
  • ఇందులో 66,95,665 మంది ఆరోగ్య సిబ్బంది కొవిడ్​ టీకా మొదటి డోసు తీసుకోగా.. 25,57,837 మంది రెండో డోసు తీసుకున్నారు.
  • 53,27,587 మంది కొవిడ్​ యోధులు.. కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు.
  • సోమవారం సాయంత్రం 7 గంటల వరకు 4,27,072 వ్యాక్సిన్​ డోసులను పంపిణీ చేశారు. ఇందులో 3,25,485 మందికి టీకా మొదటి డోసు అందగా.. 1,01,587 మంది ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు అందింది.
  • టీకా కోసం సోమవారం ఉదయం రిజిస్ట్రేషన్ ప్రారంభించగా.. 25 లక్షల మంది లబ్ధిదారులు కొవిన్​ పోర్టల్​లో పేరు నమోదు చేసుకున్నారు. వారిలో 24.5 లక్షల మంది సాధారణ పౌరులు కాగా.. మిగతా వారు ఆరోగ్య సిబ్బంది, కొవిడ్​ యోధులు ఉన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 2, 2021, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details