అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనుమానాస్పద ఓటర్లపై దృష్టి సారించింది అసోం ఎన్నికల సంఘం. రాష్ట్రంలో లక్షా ఎనిమిది వేల అనుమానిత ఓటర్లు ఉన్నట్లు లెక్కగట్టింది. వీరందరికి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అనుమతి లేదని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నితిన్ ఖాడే తెలిపారు. గతేడాది అనుమానిత ఓటర్ల సంఖ్య 1.13 లక్షలుగా ఉండేదని పేర్కొన్నారు.
అరోడా స్పష్టత
జనవరిలో అసోంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా అనుమానిత ఓటర్లపై స్పష్టత ఇచ్చారు. జాతీయ పౌర పట్టికలో పేరు లేకపోయినా ఓటర్ల జాబితాలో ఉన్న వారు ఓటు వేసేందుకు అర్హులే అని తెలిపారు. ఫారెనర్స్ ట్రైబ్యునల్ ప్రకారం విదేశీయులుగా గుర్తించిన వారికి ఓటు వేసే అనుమతి ఉండదని స్పష్టం చేశారు. వీరినే అనుమానాస్పద ఓటర్లుగా పరిగణిస్తారని అన్నారు.
భద్రత కోసం..
ఎన్నికల నేపథ్యంలో 40 కేంద్ర భద్రతా బలగాల బృందాలు రాష్ట్రానికి చేరుకున్నట్లు ఖాడే తెలిపారు. కొవిడ్ దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఓటర్ల వివరాలు...
మొత్తం ఓటర్లు:2,32,44,454
పురుషులు: 1,17,42,661