దేశంలో ఇప్పటివరకూ మొత్తం 1.08 కోట్ల కరోనా టీకా డోసులు అందించినట్టు కేంద్రం ప్రకటించింది. టీకా పంపిణీ పురోగతిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మన్‌దీప్ భండారి దిల్లీలో వెల్లడించారు. శనివారం ఒక్కరోజు.. సాయంత్రం 6 గంటల వరకు 1,86,081 టీకాలు పంపిణీ చేసినట్టు తెలిపారు.
ఇవీ లెక్కలు..
1,08,38,323 డోసుల్లో.. ఆరోగ్య సిబ్బందికి 72,26,653 డోసులివ్వగా.. పారిశుద్ధ్య కార్మికులకు 36,11,670 డోసుల పంపిణీ జరిగింది. ఇక 70,52,845 డోసుల్లో.. ఆరోగ్య కార్యకర్తలకు 63,52,713 డోసులు(మొదటి) ఇవ్వగా.. 8,73,940 మందికి రెండవ డోసు పంపిణీ జరిగింది.
''ఈ రోజు వరకు టీకాల కారణంగా రోగనిరోధక శక్తి క్షీణత, తీవ్రమైన అనారోగ్యం, మరణం వంటి సంఘటనలేమీ నమోదు కాలేదు.''