1 Crore Lottery Winner: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.. ఓ అంబులెన్సు డ్రైవర్‌కు అలాంటి అదృష్టమే పట్టింది. లాటరీ టికెట్ కొన్న కొద్ది గంటల్లోనే రూ.కోటి రూపాయలు గెలుచుకున్నాడు.
బంగాల్లోని తూర్పు బర్ధమాన్ జిల్లాకు చెందిన షేక్ హీరా ఓ అంబులెన్స్ డ్రైవర్. ఇటీవల ఆయన రూ.270 పెట్టి లాటరీ టికెట్ కొన్నారు. మధ్యాహ్నానికే రూ. కోటి జాక్‌పాట్ తగిలింది. దీంతో కొద్దిగంటల్లోనే కోటీశ్వరుడు అయ్యారు హీరా. లాటరీ టికెట్ తగలగానే ఒక్కసారిగా ఏం చేయాలో అర్థంకాక సహాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు హీరా. పోలీసులు హీరాను జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటివద్ద దిగబెట్టి వచ్చారు.
తల్లి చికిత్స కోసం..