కేసులు ఆగడం లేదు... అప్రమత్తత అవసరం!
వచ్చే కొద్ది నెలలు భారత్ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్లో పనిచేస్తున్న భారతీయ వైద్యుడు వెలగపూడి బాపూజీ రావు చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో కరోనా వ్యాప్తి చెందుతున్న తీరు చాలా వేగంగా ఉందన్న ఆయన... ఇలాంటి పరిస్థితి భారత్లో ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ నివారణ, నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు. వృద్ధాప్యంలో ఉన్నవారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచిస్తున్న బాపూజీ రావు యూకే నుంచి ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు.