నయనానందకరం.. తిరుమల పుష్పాలంకరణం - తిరుమల శ్రీవారి ఆలయం పుష్పాలంకరణ వార్తలు
ముక్కోటి ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారి క్షేత్రం పుష్పాలంకరణతో మెరిసిపోతోంది. 10 టన్నుల పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. మహాగోపురం, ప్రాకారం, ధ్వజస్తంభం, పడికావలి, వైకుంఠద్వారాలు వివిధ రకాల పుష్పాలతో కనువిందు చేస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పూలు భక్తుల మది దోచుకుంటున్నాయి.