Tirumala Brahmotsavam: చంద్రప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం - చంద్రప్రభ వాహనంపై శ్రీవారి దర్శనం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన ఇవాళ వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో స్వామివారు చంద్రప్రభ వాహనంపై ప్రజలకు అభయప్రదానం చేశారు. ఆలయంలోని కల్యాణ మండపంలో చంద్రప్రభ వాహనసేవను అర్చకులు నిర్వహించారు. ఈ వాహన సందర్శనం.. ఆధ్యాత్మిక, అధి భౌతిక, అధి దైవికమనే త్రివిధ తాపాలను నివారిస్తుంది.