అలరించిన చిన్నారుల గాత్ర కచేరీ
ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సాంస్కృతిక సంస్థ ఢిల్లీ తెలుగు అకాడమీ వారి అన్నమాచార్య జయంతోత్సవం విశాఖలో ఘనంగా ప్రారంభమైంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు బృందాలుగా ఏర్పడి అన్నమాచార్య కీర్తనలను అలపించారు. ఏటా దిల్లీ తెలుగు అకాడమీ విశాఖలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది ఈ అన్నమయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. వివిధ సంస్థలు, విద్యాసంస్థలు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నాయి.