108 కలశాలతో రాధాకృష్ణులకు మహాకుంభాభిషేకం... - undefined
విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఉప్పల చంద్రశేఖర్‌రావు కల్యాణమండపంలో హరే కృష్ణ సత్సంగ మందిరం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. 2 రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో ఉట్టి ఉత్సవము, సాంస్కృతిక కార్యక్రమం, శ్రీకృష్ణ లీలామృతం ప్రవచనం, 108 కలశములతో రాధాకృష్ణులకు మహాకుంభాభిషేకం నిర్వహించారు. మందిరం అధ్యక్షులు దుర్లభ కృష్ణ ప్రేమ దాసు ప్రభుజీ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.