అరకు ఘాట్ రోడ్డులో ప్రమాదం.. - vishakapatnam crime news
విశాఖ జిల్లా అరకులోయ వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. పర్యాటకులతో కూడిన బస్సు 80 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లి పడిపోవడంతో చిన్నారి సహా నలుగురు చనిపోయారు. మృతులు, క్షతగాత్రులు అందరూ హైదరాబాద్‌లోని షేక్‌పేట ప్రాంతానికి చెందినవారు. తీర్థయాత్రలు ముగించుకుని అరకు వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.