Prathidwani: వైద్య విద్యలో ఫీజుల భారం.. సుప్రీం తీర్పుతో పరిస్థితి మారుతుందా ? - నేటి ప్రతిధ్వని
వైద్య విద్య ! ఎంత ప్రతిష్టాత్మకమో... అంతే ఖరీదు కూడా ! ఫీజుల భారం తగ్గాలన్నదే అందరి కోరిక. అది సాధ్యం చేసేది ఎలా అన్నది మాత్రం.. అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సరిగ్గా ఇదే సమయంలో దేశంలో వైద్య విద్య ఫీజులకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. నిర్ణీత రుసుమును మించి పైసా కూడా వసూలు చేయకూడదని.., ఫిర్యాదుల కోసం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది సర్వోన్నత న్యాయ స్థానం. అంతేకాదు.. ప్రైవేటు వైద్య కళాశాలలు నగదు రూపంలో ఫీజు తీసుకోవడం నిషిద్ధం అని.. కేపిటేషన్ ఫీజులు నియంత్రణకు ఈ నిబంధన తప్పనిసరని పేర్కొంది. ఈ సంస్కరణల నేపథ్యం ఏమిటి ? ఈ నిర్ణయంతో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.