ప్రతిధ్వని: జీతాల కోసం ఎదురుచూపులు.. పింఛన్ల కోసం పడిగాపులు - జీతం కోసం ఎదురుచూపులు అనే అంశంపై ప్రతిధ్వని చర్చ
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు..విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 10వ తారీఖు వచ్చినా ఇప్పటికీ ఎదురుచూపులు చూస్తునే ఉన్నారు ఎంతో మంది. ఈ నెలే కాదు.. కొన్నాళ్లుగా తరచూ ఇదే సమస్య. కనీసం జీతాలు, పింఛన్లకు సరిపడా నిధులు అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5లక్షల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు..పింఛను డబ్బులే ఆధారంగా బతికే మూడున్నర లక్షల మంది పింఛనుదారులు పడుతున్న ఈ అవస్థలకు కారణాలేంటి..? అసలు ఉద్యోగులు, పింఛనుదార్లలో నెలకొన్న ఆందోళన సమసిపోయే పరిస్థితులున్నాయా..? అనే అంశంపై నేటి ప్రతిధ్వని.