Prathidwani: కొత్త నిబంధనలు.. దురుసునేతల నోటికి తాళాలు పడతాయా?
Prathidwani: మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో... కీలక ఆదేశాలు జారీ చేసింది.. లోక్‌సభ సెక్రటేరియట్. జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నుంచి... సభ్యులు వాడకూడదని పదాల జాబితాను విడుదల చేశారు. అంటే...ఇకపై పార్లమెంట్‌లో సభ్యులు మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా వ్యాఖ్యలు చేయడం కుదరదు. అవినీతిపరుడు.. అసమర్థుడు.. నియంత.. సహా అనేక పదాలకు వారి వ్యాఖ్యల్లో స్థానం లేదు. చట్టసభల్లో వాడే భాషలోసభ్యత కోసమే ఈ నిర్ణయం అని పార్లమెంట్ వర్గాలు అంటుంటే... భావవ్యక్తీకరణను అడ్డుకోవడమే అని... కొందరు విపక్ష సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ పరిస్థితుల్లో కొత్త నిబంధనలను ఎలా చూడాలి? దురుసునేతల నోటికి ఇకనైనా తాళాలు పడతాయా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.