గండికోట అందాలు చూడతరమా...! - గండికోట అందాలు చూడతరమా...
కడప జిల్లా గండికోటలో చిన్నచిన్న సెలయేళ్లు, జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎర్రమల కొండల్లో గండికోటకు ఉత్తరాన సహజసిద్ధంగా ఏర్పడిన పెన్నాలోయ విశేషంగా ఆకట్టుకుంటోంది. జలపాతాలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి పర్యటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు.