ప్రతిధ్వని: కొవిడ్ కట్టడిలో పౌర సమాజం బాధ్యత ఏంటి? - Etv Pratidhwani Debate on Corona second wave
నిర్లక్ష్యం నిప్పై దహిస్తోంది. ఈ మాట కాస్త పరుషంగా ఉన్నా... ప్రస్తుతం కరోనా పరిస్థితులకు సరిగ్గా సరిపోతోంది. కొందరి అలసత్వం కారణంగా... అందరికీ కరోనా ప్రమాదం మళ్లీ ముంచుకొస్తోంది. ఏడాది పాటు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసిన వైరస్.. మరోసారి ఊహించని రీతిలో విరుచుకుపడుతోంది. కొవిడ్ ఆట కట్టించేందుకు టీకా రక్షణ కవచాలు అభయ హస్తం ఇస్తున్నా... స్వీయ జాగ్రత్తలు మాత్రమే శ్రీరామరక్షగా నిలుస్తాయన్నది ఇప్పటిదాకా ఉన్న అనుభవం. ఈ పరిస్థితుల్లో రాబోయే కొవిడ్ కల్లోలం నుంచి తప్పించుకోవడం ఎలా? ప్రజలు ఎవరికి వారు స్వతహాగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ విషయాలపై ప్రతిధ్వని చర్చ.