వీడియో వైరల్: 'మేము బతకకూడదా'... అంటూ కుటుంబం సెల్ఫీ వీడియో - నంద్యాలలో కుటుంబం సెల్ఫీ వీడియో తాజా వార్తలు
అబ్దుల్ సలాం సెల్ఫీ వీడియో తరహాలో... కర్నూలు జిల్లా నంద్యాలలో మరో కుటుంబం తీసిన సెల్పీ వీడియో వైరల్ అయింది. నంద్యాలకు చెందిన విద్యుత్ స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్ మునాఫ్ అనే వ్యక్తి.... కుటుంబ సభ్యులతో కలిసి సెల్పీ వీడియో తీశాడు. తనకు న్యాయంగా వచ్చిన కాంట్రాక్ట్‌ను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి అడ్డుపడి స్థానికేతర వ్యక్తికి ఇచ్చాడని మునాఫ్ కుమారుడు సూరజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మేము బతక కూడదా? అని వాపోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అయింది.