Prathidwani : సీపీఎస్ రద్దుకు కాలయాపన... ఉద్యోగుల నిరీక్షణలు ఫలిస్తాయా? - నేటి ప్రతిధ్వని
వాయిదాల మీద వాయిదాలు వెళ్లిపోతున్నాయి. కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో నిర్ణయం అన్న సీపీఎస్ రద్దు ఊసు మాత్రం.. ఎత్తడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలామంది ఉద్యోగుల్లో రగులుతున్న ఆక్రోశం ఇది. దశలవారీగా ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా.. సీపీఎస్ ఉద్యోగుల గోడు వినే నాథుడే కనిపించడం లేదు. ప్రతిపక్ష నేతగా అంత స్పష్టంగా హామీ ఇచ్చిన నాయకుడు... ఇప్పుడెందుకు ముఖం చాటేస్తున్నాడు? రద్దు ఎప్పుడంటే ప్రభుత్వ సలహాదారు సాంకేతికాంశాలంటూ... కాలయాపనకు కారణాలు ఎందుకు వెదుకుతున్నట్లు? ఇవే సూటి ప్రశ్నలు సంధిస్తున్నాయి.. సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు . మరి వీరి నిరీక్షణలు ఫలిస్తాయా? సీపీఎస్ స్థానంలో మళ్లీ పాతపెన్షన్ విధానం చూస్తారా... ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST