తుంగభద్ర పుష్కరాలు: ఘాట్లలో పెరిగిన భక్తుల రద్దీ - కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు నాలుగోరోజు కొనసాగుతున్నాయి. నదిలోకి దిగేందుకు అధికారులు అవకాశం కల్పించకపోవడంపై.. భక్తుల నుంచి తీవ్రవ్యతిరేకత వస్తోంది. చివరికి.. నదిలో దిగేందుకు కొన్ని చోట్ల అధికారులు అనుమతి కల్పిస్తున్నారు. కార్తీక సోమవారం కావడంతో కొన్ని ఘాట్లలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. వేకువజాము నుంచే భక్తులు ఘాట్లకు వచ్చి నదీమతల్లికి పూజలు చేస్తున్నారు. సంకల్‌బాగ్ ఘాట్, మంత్రాలయం ఘాట్‌లలో భక్తుల సందడి పెరిగింది.
Last Updated : Nov 24, 2020, 10:42 AM IST