పర్యటకులను కట్టిపడేస్తున్న తుంగభద్ర - dam
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయంలో వరద ప్రవాహం పరవళ్లను చూసేందుకు పర్యటకులు పోటెత్తుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నిండుకుండలా మారిన ప్రాజెక్ట్ చూడటానికి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. జలాశయం నుంచి గేట్ల ద్వారా దిగువకు నీరు పారుతున్న దృశ్యం పర్యాటకులను అట్టే కట్టిపడేస్తోంది. సెలవులు పూర్తైనా దూరప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు అనేకమంది తమ సెలవును పొడిగించుకొని తుంగభద్ర డ్యాం వద్దకు వచ్చి అపురూప దృశ్యాన్ని తిలకిస్తున్నారు. చాలా ఏళ్ల తరువాత ఇంతటి ప్రవాహం ఉండటంతో అధికారులు సందర్శకులకు కనువిందు చేసేలా స్పిల్ వే గేట్ల వద్ద రంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. పగటి పూట ఊరకలేస్తూ కనిపించే వరద నీరు.. చీకటి పడగానే మరింత అందంగా రంగుల దీపపు కాంతుల్లో కనువిందు చేస్తోంది.