AR Rehaman Bathukamma Song: ఏఆర్ రెహమాన్ బతుకమ్మ పాట.. వినేద్దాం మనసారా
బతుకమ్మ పండుగంటే చాలు... చిన్నారుల నుంచి పండు ముసలి వరకు.. ఊయ్యాలో ఉయ్యాలో అంటూ.. కాలు కదపక మానరు. పాటలతో ప్రతీ వీధి మారుమోగుతోంటే.. కాలిగజ్జెల అడుగులు.. గాజుల చప్పట్లతో ఆటలు మామూలుగా ఉండదు. ఈ పండగ కోసం విడుదలయ్యే పాటలు కూడా ఓ రేంజ్‌లోనే ఉంటాయి. మరి.. ఈసారి మన బతుకమ్మ పాట కోసం ఏఆర్ రెహమానే రంగంలోకి దిగారు. గౌతమ్‌మీనన్ ఆ పాటకు దర్శకత్వం వహించారు. అల్లిపూల వెన్నెల.. చెరువులోన కురవగా.. పూల ఇంద్రధనుస్సులే.. నేల మీద నిలవగా.. అంటూ సాగే ఈ పాట.. బతుకమ్మ విశిష్టతను.. పండుగలోని ప్రాముఖ్యతను.. కళ్లకు కట్టినట్టు.. వీనుల విందుగా.. ఆడపడుచులకు అందించారు. మీరు వినేసి.. బతుకమ్మ ఆటలో అడుగులు కదపండి మరీ..