స్టైలు... స్టైలురా... హెయర్ స్టైలురా!
విజయవాడలో స్ట్రీక్స్ రెట్రో రీమిక్స్ పేరుతో హెయిర్ అండ్ బియాండ్-2019 కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్.. యోల్లీ టెన్ కొప్పెల్.. వివిధ రకాల హెయిర్ స్టైల్స్ లో నగరంలోని హెయిర్ సెలూన్ నిర్వాహకులకు శిక్షణ ఇచ్చారు. ప్రిసిషన్ బాబ్, అన్ డన్ మెస్సీ పోనీటైల్, షార్ట్ బాబ్, బ్లూ ఫాక్స్ స్లీక్....ఇలా పలు రకాల హెయిర్ స్టైల్స్ ను నగర వాసులకు పరిచయం చేశారు. హెయిర్ కేర్, కలర్, స్టైల్ కు సంబంధించి.. బ్రూనెట్, గోల్డ్, కాపర్ బ్లాండ్, బ్రౌన్ షేడ్స్ వంటి హెయిర్ స్టైల్స్ ను రీమిక్స్ చేసి చూపించారు. స్ట్రీక్స్ నూతన ఆవిష్కరణలను డివిజన్ హెడ్ రొచెల్లీ చాబ్రా వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్థమాన నటి నిధి అగర్వాల్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.