Pratidwani: జనరిక్ మందుల నాణ్యతల్లో వాస్తవాలేంటి ?.. ప్రజలకు చేరువ చేయడం ఎలా ? - జనరిక్ మందులు అంటే
అలలు అలలుగా వైరస్‌లు వెంటాడుతున్న కొవిడ్ కాలంలో జనం ఔషధాలపై పెడుతున్న ఖర్చు పెరిగింది. ఆపత్కాలంలో ఆందోళనల మధ్య మెడికల్ షాపుల్లో మందుల కోసం జనం జేబులు ఖాళీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యులపై మోయలేని భారంగా మారిన ఔషధాల ఖర్చులు తగ్గిస్తూ జనరిక్ మందులు చేయందిస్తున్నాయి. ఏఏ అనారోగ్య సమస్యలకు జనరిక్ షాపుల్లో ఔషధాలు చౌకగా లభిస్తున్నాయి ? అసలు జనరిక్ మందుల నాణ్యతపై ఉన్న అపోహలేంటి ? జనరిక్ మందులను ప్రజలకు చేరువ చేయడం ఎలా ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.