Pratidwani: సీఆర్డీఏ చట్టంలో ఏముంది ?.. రాజధాని రైతులు ఏం కోరుకుంటున్నారు ?
రాష్ట్ర రాజధాని ప్రాంతం.. అమరావతి కథలో మరో అంకం వాడీవేడీగా మారింది. అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 19 గ్రామాల విలీన ప్రతిపాదనలు కాక రేపుతున్నాయి. ఇప్పటివరకు అభిప్రాయ సేకరణ కోసం గ్రామ సభలు జరిగిన అన్నిచోట్ల ముక్తకంఠంతో తిరస్కరణే ఎదురైంది. ఆ మేరకు తీర్మానాలు కూడా చేశారు. అసలు నాటి భూసమీకరణ ఒప్పందాలు.. సీఆర్డీఏ చట్టంలో ఏం ఉంది.. రాజధాని ప్రాంత రైతులు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త కార్పొరేషన్ ప్రతిపాదనను వాళ్లంతా ఎందుకు తిరస్కరిస్తున్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది.