విద్యుత్ దీపకాంతుల్లో మోదకొండమ్మ వెలుగులు - మోదకొండమ్మ
విశాఖ మన్యం గిరిజన ఆరాధ్య దేవత పాడేరు శ్రీ మోదకొండమ్మ మొదటి రోజు(ఆదివారం) ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పాడేరు నుంచి మోదకొండమ్మ ఆలయం వరకు మూడు కిలోమీటర్ల మేర విద్యుత్ దీపాల అలంకరణలతో పరిసరాలు దగ దగ మెరుస్తున్నాయి. ఉత్సవాలు చూడడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఇంకా రెండు రోజులు సోమ, మంగళవారం... ఈ ఉత్సవాలు జరగనున్నాయి.