విశాఖ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ
విశాఖ సాగర తీరంలో చల్లటి గాలి పీల్చే ఆ జనం ఒక్కసారిగా విషవాయువు బారిన పడ్డారు. ఓ పరిశ్రమ నుంచి ప్రమాదవశాత్తు రసాయన వాయువు లీక్ అవగా.. చుట్టుపక్కల ఉండే ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. విషవాయువు కారణంగా అపస్మారక స్థితిలోకి చేరారు. తమ చిన్నారులను రక్షించుకునేందుకు తల్లిదండ్రులు ఆస్పత్రి వైపు పరుగులు పెట్టారు. పచ్చని చెట్లు మాడిపోయాయి. వందలాది మూగజీవాలు నేలకొరిగాయి. ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న ఈ భారీ ప్రమాదంతో ఇప్పటికే 8 మంది మృతిచెందగా, మరో 200 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషాద ఘటనకు సంబంధించి హృదయవిదాకరమైన దృశ్యాలివి.