ప్రతిధ్వని: అమెరికా ఎన్నికలు.. హోరాహోరీ!
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ల మధ్య ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. అమెరికన్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్, జో బైడెన్లు ఇద్దరూ భారతీయ అమెరికన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ట్రంప్ కంటే జో బైడెన్‌కు ప్రజాదరణ ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అమెరికాలో ప్రజల ఓట్ల కంటే ఎలక్టోరల్ కాలేజీ స్థానాలే గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ల నాడి ఎలా ఉంది? శ్వేతసౌధంలో పాగా వేసేది ఎవరు? విజయావకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావత అంశాలేంటి? అనే విషయాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.