ప్రతిధ్వని: గందరగోళంలో విద్యావ్యవస్థ.. అక్కరకు రాని ఆన్‌లైన్ బోధన
కరోనా కల్లోలం విద్యా వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. పిల్లలు వాళ్లవాళ్ల తరగతుల్లో ఏం నేర్చుకున్నారో తెలీదు.. నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుందో అర్థం కాదు. ఆపై ఆన్‌లైన్ బోధనలో సాంకేతిక సమస్యలు.. విద్యార్థుల అభ్యాసానికి గుదిబండలుగా మారాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలపై మోయలేని భారం పడింది. ఏడాదిగా అరకొర చదువులు, అత్తెసరు జ్ఞానంతో పిల్లల అకడెమిక్ భవిష్యత్తు అంధకారంలోకి జారిపోయిందని ఆవేదన చెందుతున్నారు తల్లిదండ్రులు. కానీ.. విద్యాసంవత్సరం ముగిసిన దశలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు మాత్రం ఫీజుల వసూలు అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. పూర్తి ఫీజులు కట్టకపోతే పైతరగతులకు ప్రమోట్ చేసేది లేదంటూ ఒత్తిడి పెంచుతున్నాయి. అసలు ఈ పరిస్థితుల్లో ఫీజుల నిర్ణయం, వసూళ్లపై ప్రభుత్వ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి? కరోనా కష్టకాలంలో ఫీజుల రాయితీలపై సుప్రీం కోర్టు చేసిన సూచనలు ఏంటి ? ఈ అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.