ప్రతిధ్వని: వర్షాల ప్రభావం... ధరలు భగభగ - భారత్ డిబేట్
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. భారీ వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. అడ్డూ అదుపూ లేకుండా ధరలు మండిపోతున్నాయి. ఉల్లి ధరలు కంటనీరు తెప్పిస్తున్నాయి. ఆకు కూరలు సైతం కొనేటట్టు లేదు. చికెన్, గుడ్ల ధరలు పెరిగిపోయాయి. అన్ని నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్న కారణంగా.. సామాన్య ప్రజలు విలవిల్లాడుతున్నారు. అటు.. వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయి రైతులు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో.. భగ్గుమంటున్న ధరలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.