ఘనంగా చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు - chenna keshava
ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజుతో బ్రహ్మోత్సవాలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు గజ వాహనం పై సార్వభౌమ అలంకారం లో చెన్నకేశవ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించారు.