ప్రకాశం జిల్లా వైసీపీలో ముదురుతున్న వివాదం - నూతన ఇన్ఛార్జ్ ఫ్లెక్సీల చించివేత - tadipatri chandrasekhar
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2024, 5:16 PM IST
YSRCP Leaders Flexi Controversy: నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పుతో వైసీపీలో మొదలైన తీవ్ర అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నూతన ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్, ఇప్పటి వరకూ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని నూతనంగా వచ్చిన యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తాడిపత్రి చంద్రశేఖర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి సురేష్ అతిథి గృహానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. సీసీ కెమెరాలు లేనిచోట మాత్రమే ఫ్లెక్సీలు చించేశారు. కావాలనే చేశారని ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ మద్దతు దారులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కాదని ఇటీవల తాడిపత్రి చంద్రశేఖర్‌ను నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా అధిష్ఠానం నియమించింది.
మరోవైపు తాటిపత్రి చంద్రశేఖర్ నిర్వహించే సమావేశాలకు సైతం మంత్రి సురేష్ మద్దతు దారులు హాజరు కావడం లేదు. కొద్ది రోజుల క్రితం పార్టీ నాయకులతో తాడిపత్రి చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సురేష్ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎవరూ హాజరు కాలేదు.