ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ysrcp_flag_in_road_pothole

ETV Bharat / videos

YSRCP Flag in Road Pothole: 'ఇదీ మా ఘనతే..!' రోడ్డుపై ప్రమాదకరంగా గుంత.. పార్టీ జెండాతో వాహనదారులకు హెచ్చరిక - YSRCP Party Flag in Road

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2023, 5:35 PM IST

Updated : Oct 26, 2023, 7:41 PM IST

YSRCP Flag in Road Pothole:గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో నడిరోడ్డుపై ఓ గుంత ఏర్పడింది. ప్రమాదకరంగా మారిన ఈ గుంతను పూడ్చాల్సిన భాద్యత అధికార వైసీపీ పార్టీ మర్చిపోయినట్లుంది. ఆ గుంత వల్ల వాహనదారులు ప్రమాదానికి గురికాకుండా ఉండేందుకు కనీసం హెచ్చరిక బోర్డునైనా ఏర్పాటు చేయలేదు. చివరకి వైసీపీ బస్సుయాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో.. ఆ గ్రామంలో వైసీపీ జెండాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఓ జెండాను ఏర్పాటు చేశారు. గుంతలో వైసీపీ జెండాను ఏర్పాటు చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కొలకలూరు నుంచే వైసీపీ బస్సుయాత్ర ప్రారంభం కానుండటంతో.. కొలకలూరు గ్రామంలో వైసీపీ జెండాలు ఏర్పాటు చేశారు. అయితే హెచ్చరిక బోర్డు స్థానంలో ఒక జెండాను గోతిలో ఏర్పాటు చేశారు. సాధారణంగా రోడ్లపై గోతులు ఏర్పడితే అక్కడ హెచ్చరిక బోర్డులు పెడతారు. ఇక్కడ వైసీపీ జెండానే హెచ్చరిక బోర్డుగా ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. జెండాపై ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఫోటో ఉండటం మరింత విమర్శలకు దారి తీసింది.

Last Updated : Oct 26, 2023, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details