ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ys_sharmila_sajjala

ETV Bharat / videos

నా గురించి ఎందుకు సజ్జల - ముందు కేసీఆర్​ వ్యాఖ్యలకు సమాధానం చెప్పండి: వైఎస్ షర్మిల - వైఎస్ షర్మిల చిత్రాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 3:28 PM IST

Updated : Nov 6, 2023, 4:06 PM IST

YS Sharmila Sajjala Counter to Sajjala Ramakrishna Reddy:వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. షర్మిల ఎన్నికల్లో పోటీ విరమించుకుని కాంగ్రెస్​కి మద్ధతివ్వటం పట్ల సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్ఫందించారు. (YS Sharmila) ఈ మేరకు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో తాను పార్లీ పెట్టినప్పుడు ఏం సంబంధం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి... ఇప్పుడు తాను కాంగ్రెస్‌కు మద్దతిస్తుంటే ఎందుకు స్పందిస్తున్నారంటూ షర్మిల ప్రశ్నించారు. 

ఏపీ పరిస్థితిపై కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలకు ముందు సజ్జల సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) ను దింపే శక్తి కాంగ్రెస్‌కు ఉందని ఆమె పేర్కొన్నారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించినట్లు షర్మిల స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. అన్ని పార్టీల్లో దొంగలుంటారని.. కానీ ఆ దొంగలు సీఎంలు కాకూడదని ఆమె వ్యాఖ్యానించారు.

Last Updated : Nov 6, 2023, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details