Anil Kumar Yadav: లోకేశ్ చేసేది పాదయాత్ర కాదు.. విహార యాత్ర: అనిల్ కుమార్ - మాజీ మంత్రి అనిల్ కుమార్ కామెంట్స్
anil kumar yadav comments: లోకేశ్ పాదయాత్ర కాదు.. విహార యాత్ర అంటూ నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. రోజూ సాయంతం పాదయాత్ర పేరుతో నారా లోకేశ్ విహార యాత్ర చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో లోకేశ్ మంగళగిరి నుంచి గెలవాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రారంభించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించేందుకు ముందుకు రావాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశాడు. పార్టీలు మారడం రామనారాయణరెడ్డి పరిపాటిగా మారిపోయిందని విమర్శించాడు. ఆనం తన పదవి వదులుకుని లోకేశ్ పాదయాత్రలో పాల్గొనాలని అనిల్ కుమార్ సూచించాడు.
గతంలో సీఎం జగన్ చేసింది పాదయాత్ర అని తెలిపిన అనిల్ కుమార్.. రాత్రి సమయంలో ప్రజలు పడుకున్న తరువాత కొంతమందిని వెంటబెట్టుకొని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో నెలూరు జిల్లాలో 10 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా నుంచి ఎనిమిది సంవత్సరాలుగా మంత్రిగా కొనసాగిన ఆనం సంగం బ్యారేజ్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశాడు.