ఆంధ్రప్రదేశ్

andhra pradesh

tdp_cherika

ETV Bharat / videos

టీడీపీలోకి వలసల జోరు - గిద్దలూరులో 50 కుటుంబాలు చేరిక - ycp member joined tdp

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 10:57 AM IST

YCP Members Who Joined TDP : ప్రకాశం జిల్లా గిద్దలూరులో అధికార పార్టీకి షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. పట్టణంలోని 20వ వార్డుకు చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరందరికి టీడీపీ ఇన్​ఛార్జ్​ అశోక్​ రెడ్డి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అన్ని వర్గాల వారి అభివృద్ధి చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని అశోక్​ రెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ హయంలో జరిగిన అభివృద్ధిని చూసి వీరంతా పార్టీలో చేరడానికి సుముఖత చూపారని అశోక్​ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ హయంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలపై అక్రమంగా కేసులు, దాడులు జరిగాయని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలో కలిసి పోటీ చేసున్నామని, కచ్చితంగా తమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తనని గెలిపిస్తే పట్టణంలో ప్రధానంగా ఉన్న రాచర్ల రైల్వేగేటు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details